పడి పడి లేచే మనసు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచే మనసు’ కలకత్తా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కలకత్తాలో 70 రోజుల షూటింగ్ పూర్తిచేసుకున్న అనంతరం నేపాల్‌లో కొంతభాగం షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు కలకత్తా షెడ్యూల్‌లో చిత్రీకరించాం. సినిమా బాగా వస్తోంది. డైరెక్టర్ హను రాఘవపూడి మంచి ప్రేమకథతో మీ ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సాయిపల్లవి ఈ సినిమాలో చూడముచ్చటగా కనిపించబోతున్నారు. మురళీశర్మ, సునీల్, వెనె్నల కిశోర్ ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జయకృష్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు అని అన్నారు. శర్వానంద్, సాయిపల్లవి, మురళీశర్మ, సునీల్, వెనె్నల కిశోర్, ప్రియదర్శి, ప్రియరామన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జయకృష్ణ గుమ్మడి, నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి, దర్శకత్వం: హను రాఘవపూడి.