నటుడు వినోద్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీనియర్ నటుడు వినోద్ (59) కన్నుమూశారు. హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఎన్నో సినిమాల్లో విలన్‌గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన వినోద్ శనివారం తెల్లవారు జాము న 3 గంటల సమయంలో హైదరాబాద్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో తుదిశ్వాస విడిచారు. వినోద్ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. ఆయన స్వస్థలం తెనాలి. వినోద్ నటించిన మొదటి చిత్రం 1980లో వి.విశే్వశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘కీర్తి కాంత కనకం’. ఈ సినిమాలో వినోద్ కథానాయకుడిగా నటించారు. పలు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన ఆయన బుల్లితెరపై కూడా పలు సీరియళ్లలోనూ నటించి మెప్పించారు. ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీడ్రైవర్, మిర్చితోపాటు దాదాపు 300 చిత్రాల్లో నటించారు. ఫ్యాక్షన్ చిత్రాల్లో విలన్‌గా వినోద్ అందరికీ సుపరిచితం. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా వినోద్ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.

వినోద్ (ఫైల్‌పొటో)