నానితో అనుష్క?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజ నటుడు నాని ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ‘దేవదాస్’ అనే మల్టీస్టారర్ చిత్రంలో అగ్రహీరో నాగార్జునతో కలిసి నటిస్తున్నాడు. దాంతోపాటు బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్ 2’కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక వీటితోపాటు త్వరలోనే ‘మళ్ళీరావా’ చిత్ర దర్శకుడు గౌతమ్ తెరకెక్కించే ‘జెర్సీ’ చిత్రంలో నటించనున్నాడు. ఇక ఇప్పుడు ఆయన తాజాగా ‘సాహసం’ చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా నటించనున్నాడని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రముఖ హీరోయిన్ అనుష్కను తీసుకోవాలనుకుంటున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. కొద్దిరోజుల్లోనే ఆమెకు స్క్రిప్ట్ వినిపించనున్నారని సమాచారం. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది.