రజనీ సరసన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా మాజీ భామ సిమ్రాన్ ను ఎంపిక చేశారు. అప్పట్లో తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఈమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. తాజాగా తమిళంలో ఓ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్న సిమ్రాన్‌ను ఈ సినిమాలో రజనీకి జోడీగా ఎంపిక చేశారు. ప్రస్తుతం డార్జిలింగ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెలలో చెన్నైలో జరగనుంది. లేటెస్టుగా రజనీ నటించిన కాలా సినిమా తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆయన నటించిన రోబో 2.0 విడుదలకు సిద్ధంగా ఉంది.