తీసిన ప్రతి సినిమా విడుదల కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడుదలకు నోచుకోని సినిమా అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండకూడదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. థియేటర్‌లో విడుదల కావడం అనేది నిర్మాణం జరిగిన ప్రతి సినిమా హక్కు అని ఆయన చెప్పారు. పరిశ్రమలో వెయ్యికి పైగా చిత్రాలు విడుదల కాకుండా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇటీవలే గౌరవ డాక్టరేట్ పొందిన ప్రతాని రామకృష్ణగౌడ్ సన్మాన కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ ఛైర్మన్ లింగపల్లి కిషన్‌రావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అతిథుల చేతులమీదుగా రామకృష్ణగౌడ్‌కు సన్మానం జరిగింది. అనంతరం ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. రాజకీయాలా, సినిమా అనే సందర్భం వచ్చినప్పుడు నేను సినిమానే ఎంచుకున్నాను. ఎందుకంటే సినిమా మీద నాకున్న ప్రేమ అలాంటిది. ఇక్కడికి వచ్చి చూశాక చాలా సమస్యలు ఉన్నాయనిపించింది. పరిశ్రమలో కొందరి ఆధిపత్యం సాగుతోంది. చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతోంది. ముఖ్యంగా చిత్రాల విడుదల సమయంలో చిన్న నిర్మాత ఇబ్బందులు పడుతున్నారు. టాలీవుడ్‌లో సుమారు వెయ్యి చిత్రాలు విడుదలకు నోచుకోకుండా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలో ఒక యాప్‌ను విడుదల చేయబోతున్నాం. దీనిద్వారా సినిమాలు ప్రదర్శించి నిర్మాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు కృషిచేస్తాం. ఇకపై విడుదల కాని సినిమా ఉండకూడదు. భవిష్యత్‌లో సినిమాల విడుదలకు థియేటర్‌కంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు వస్తాయని ఆశిస్తున్నాం. డాక్టరేట్ రావడం ఒక గౌరవం. అయితే దీంతోనే ఏదో సాధించినట్లు భావించడం లేదు. ఇంకా మరింత ఉత్సాహంతో పరిశ్రమకు సేవ చేయాలని అనుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ సెక్రటరీ సాయి వెంకట్, ఉపాధ్యక్షుడు మోహన్‌గౌడ్, నటుడు, నిర్మాత మధు, తెలంగాణ నటీనటుల సంఘం జాయింట్ సెక్రటరీ లత, షీ టీమ్స్ హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.