‘విశ్వామిత్ర’ లోగో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కిరణ్ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘విశ్వామిత్ర’. నందితరాజ్, సత్యం రాజేశ్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్, విద్యుల్లేఖా రామన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. రాజ్‌కిరణ్ దర్శకత్వంలో మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో అశుతోష్ రాణా విడుదల చేశారు. ఈ సందర్భంగా.. అశుతోష్ రాణా మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్ ఉంది. అందుకు ఇక్కడివారు వివిధ విభాగాలను చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. నాకు మహిళలు లక్కీ ఎందుకంటే నా తొలి సినిమా దుష్మన్‌కి దర్శక, నిర్మాతలు మహిళలే. ఈ సినిమాలో నందితరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాను. ఈ సినిమాలో నేను పాజిటివ్ భర్త పాత్రలో కనపడతాను. రాజ్‌కిరణ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పనిచేసిన ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు’ అన్నారు. చిత్ర దర్శకుడు రాజ్‌కిరణ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం హారర్, థ్రిల్లర్ జోనర్ సినిమాలదే హవాగా ఉంది. ఒక నిజ ఘటనను ఆధారంగా చేసుకుని సినిమాచేయాలని చాలా రోజులుగా అనుకునేవాడిని. అది ఇప్పటికి తీరింది. యుఎస్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ ఆర్టికల్ చదివి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథను తయారుచేసుకున్నాను. ఓ స్నేహితుడికి ఈ కథ చెప్పగానే.. ఇలా కూడా జరుగుతుందా? అని అన్నారు. ఆయనే ఇలాంటి ఘటనే స్విట్జర్లాండ్‌లో కూడా జరిగిందని చెప్పారు. అప్పుడు నేను ఆ వివరాలనుకూడా సేకరించాను. అలా యు.ఎస్, స్విట్జర్లాండ్ ఘటనల ఆధారంగా విషయాలను క్రోడీకరించి ఈ కథను తయారుచేశాను. మాధవిగారు, రజనీకాంత్‌గారు నిర్మాతలుగా ఈ సినిమా చేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉంది. వారు మొదటి సిట్టింగ్‌లోనే ఈ సినిమాను ఓకేచేశారు. సత్యం రాజేష్‌నే హీరో అని ఫిక్స్ అయ్యి కథను తయారుచేశాను. చాలామంది హీరోయిన్స్‌ను కలిస్తే కథ బావుంది, హీరో ఎవరు అని అడిగారు. సత్యంరాజేశ్ అని చెప్పగానే చాలామంది డ్రాప్‌అయ్యారు. కానీ నందితరాజ్ కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆమెకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. నా మిత్రుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాకు మాటలను అందించారు. అలాగే మరో స్నేహితుడు బి.వి.ఎస్.రవిగారి సహకారం కూడా మరువలేనిది’ అన్నారు.