పొలాచ్చికి అరవింద సమేత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో యాభై శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌కోసం పొలాచ్చి వెళ్లనుంది. అక్కడే 10 రోజులపాటు చిత్రీకరణ జరుపుతారట. ఎన్టీఆర్- త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాను కూడా అదే రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేసాడు త్రివిక్రమ్. పవన్‌కళ్యాణ్‌తో ఆయన తీసిన అజ్ఞాతవాసి ఎఫెక్ట్‌తో తనకు మంచి హిట్ సినిమా కావాలి కాబట్టి అదే రేంజ్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. తదుపరి షెడ్యూల్ ఈనెల 25నుండి పొలాచ్చికి వెళ్లనున్నారు. ఆ తరువాత యూరోప్‌లో రెండు పాటలను కూడా చిత్రీకరించి దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హారికా హాసిని బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ వర్గాల్లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఈ టీజర్‌ని ఆగస్టు 15న విడుదల చేస్తారట. అరవింద సమేత వీర రాఘవ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.