దుల్కర్ సల్మాన్ హీరోగా జనతాహోటల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా విజయవంతమైన చిత్రాలు అందించడం అంటే ఆషామాషీ కాదు. పైగా, కేవలం కమర్షియల్ హిట్ చిత్రాలుగా మాత్రమేకాకుండా, ప్రేక్షకుల హృదయాలను కూడా తాకే చిత్రాలుగా పేరుతెచ్చుకోవడం అంటే చిన్న విషయంకాదు. ‘ప్రేమిస్తే’నుంచి ‘శంభోశంకర’ మూవీ వరకు సురేష్ కొండేటి అందించిన చిత్రాలూ ఈ కోవకే వస్తాయి. ఫీల్‌గుడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌గా ఇలా సురేశ్ అందించిన అన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని ఆయనకు మంచి నిర్మాత అనే పేరుతెచ్చాయి. ఇప్పుడు సురేష్ కొండేటి ’జనతా హోటల్’చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర విశేషాల్లోకి వస్తే.. ‘మహానటి’ చిత్రం తర్వాత దుల్కర్ సల్మాన్‌కు మంచి పేరుతెచ్చిపెట్టే గొప్ప చిత్రమిది. ‘ఓకే బంగారం’తో తెలుగు, తమిళ ప్రేక్షకులతో కూడా మంచి జోడీ హిట్ పెయిర్ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్ నిత్యామీనన్ జంటగా రూపొందిన సూపర్‌హిట్ మలయాళం చిత్రం ఉస్మాద్ హోటల్. ఈ చిత్రాన్ని ‘జనతాహోటల్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. సురేష్ కొండేటి. అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్ర విశేషాలను సురేష్ కొండేటి తెలియజేస్తూ ‘మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచిన చిత్రం ఇది. కథాకథనంతో పాటు దుల్కర్, నిత్యామీనన్‌ల జంట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లవ్, సెంటిమెంట్, పేద, ధనికవర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చక్కని ఫీల్‌గుడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. సాహితి రాసిన సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన ‘జర్నీ’, ‘పిజ్జా’, ‘డా.సలీమ్’చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు ‘జనతాహోటల్’కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్.లోకనాథం, దర్శకత్వం: అన్వర్ రషీద్, నిర్మాత: సురేష్ కొండేటి.