కథానాయిక ఆమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం గురించి ఇన్నాళ్లు కథాకథనాలు అనేకం వినిపించాయి. కొంతమంది ఆ సినిమా వస్తుందా రాదా అన్న మీమాంసలో కూడా వుండిపోయారు. ఎట్టకేలకు తమిళంలో విజయవంతమైన ఓ చిత్రానికి రీమేక్‌గా చిరంజీవి 150వ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఎవరా అని అభిమానులు ఎదురుచూశారు. ఆ వార్త కూడా తెలిసిపోయింది. నయనతార డైరీలో మే నుండి చిరంజీవి చిత్రంలో నటించడానికి కాల్షీట్లు ఉన్నాయని తెలుస్తోంది. దీన్నిబట్టి చిరంజీవి 150వ చిత్రంలో కథానాయిక నయనతారేనని చెబుతున్నారు ఫిలిమ్‌నగర్ జీవులు. మే నుండి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నదట. సో చిరంజీవి సరసన నయనతార అన్నమాట!