ముహూర్తం కుదిరిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సంచలన విజయం సాధించి బాలయ్య కెరీర్‌లో నిలిచిపోయాయి. బాలయ్యలోని మాస్ ఎమోషన్స్‌ని కరెక్ట్‌గా ప్రజెంట్ చేసి సంచలన విజయం అందుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే హ్యాట్రిక్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను అక్టోబర్ 10న ప్రారంభిస్తారట. మైత్రి మూవీస్ నిర్మించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ నుండి మొదలుపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య అన్న ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. నవంబర్ వరకు దాదాపు టాకీపార్ట్ పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. అలాగే బోయపాటి శ్రీను కూడా రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమా షూటింగ్ కూడా నవంబర్ వరకు పూర్తికానున్న నేపథ్యంలో అప్పుడే మొదలుపెడతారట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి.