తాంత్రిక గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగకుమార్ నటిస్తూ నిర్మిస్తున్న థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ ‘తాంత్రిక’. ఎం.శ్రీ్ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కాంత్, కార్తీక్, మనీషా, సంజన, గీతాషా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర గీతాలు విడుదలయ్యాయి. జాన్, నాగవంశీ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను సాయి వెంకట్ విడుదల చేశారు. తొలి ప్రతిని సంగకుమార్ స్వీకరించారు. అనంతరం సాయి వెంకట్ మాట్లాడుతూ సంగకుమార్ అన్నీ తానై వరుసగా నాలుగు చిత్రాల్ని సిద్ధం చేయడం ఆనందంగా వుంది. సరికొత్త నేపథ్యంలో తెరకెక్కిన ‘తాంత్రిక’ మంచి విజయాన్ని సాధించి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు. సంగకుమార్ మాట్లాడుతూ- రెండేళ్ళ క్రితం రాష్ట్ర ప్రభుత్వం చిన్న సినిమాకు ఐదవ ఆటను కేటాయించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తాంత్రిక చిత్రంతో పాటు మరో మూడు సినిమాల్ని రూపొందించాను. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాల్ని వచ్చే నెల నుంచి వరుసగా నెలకు ఒక చిత్రాన్ని విడుదల చేయబోతున్నాను. దైవశక్తికి, క్షుద్రశక్తికీ మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా తాంత్రిక నిర్మించాం అన్నారు. రాజ్‌కాంత్ మాట్లాడుతూ- ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. సంగకుమార్ మరిన్ని చిత్రాల్ని నిర్మించి విజయాల్ని సొంతం చేసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజన, సంజన మేరీ, మల్టీస్టార్ విజయ్, దర్శకుడు ఎం.శ్రీ్ధర్, పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.