మళ్లీ డాన్‌గా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి డాన్ పాత్రలో కనిపించనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ డాన్‌గా నటించిన బాషా సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత కబాలిలో డాన్‌గా కనిపించిన రజనీ.. లేటెస్టుగా కాలా సినిమాలో కూడా డాన్‌గా కనిపించాడు. తాజాగా ఆయన మరోసారి డాన్ పాత్రలో కనిపిస్తాడట. అయితే ఈసారి కేవలం రాత్రిళ్లలోనే ఆయన డాన్‌గా కనిపిస్తాడని పగలు మాత్రం హాస్టల్ వార్డెన్‌గా ఉంటాడట? ఆ వివరాల్లోకి వెళితే రజనీకాంత్ తాజాగా నటిస్తున్న సినిమా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్‌లో జోరుగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ డాన్‌గా ఉంటాడట. ఆ తరువాత షెడ్యూల్‌ని మధురైలో వేసిన భారీ సెట్స్‌లో జరుగుతుందట. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో పాటు సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా నటిస్తోంది.