అతిథిగా హ్యాపీ వెడ్డింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2018లో రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించి.. మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’ అంటూ చిత్రాన్ని నిర్మిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా ‘హ్యాపీ వెడ్డింగ్’ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నేడు (21న) జరగనుంది. ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తోంది. యంగ్ టాలెంటెడ్ దర్శకుడు లక్ష్మణ్ కార్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శక్తికాంత్ మ్యూజిక్, ఎస్.ఎస్.తమన్ రీ రికార్డింగ్ అద్భుతంగా అందిస్తున్నారు. బాల్‌రెడ్డి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే. అయితే పెళ్లి కుదిరిన రోజునుండి పెళ్లి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా చూపించాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు తమని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. ట్రైలర్ విడుదలైన తర్వాత అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. ఈ ఈవెంట్‌కు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, నిహారిక, నరేష్, మురళి శర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు నటిస్తున్నారు.