నేడు నాయకి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిష ప్రధాన పాత్రలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గోవి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నాయకి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, హారర్ జోనర్‌లో ఓ సరికొత్త కథ, కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, తన కెరీర్‌లోనే త్రిష అత్యద్భుతమైన నటనను ఈ సినిమాలో ప్రదర్శించిందని, ఆమె పాత్రలో విభిన్న కోణాలు సినిమాను నడిపిస్తాయని తెలిపారు. త్రిష కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా నిలిచే ఈ చిత్రాన్ని ఈనెల 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, జీవీ, సత్యం రాజేష్, జయప్రకాష్, సుష్మారాజ్, కోవై సరళ, మనోబాల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రఘు కుంచె, కెమెరా:జగదీష్ చీకటి, పాటలు:్భస్కరభట్ల, ఎడిటింగ్:గౌతంరాజు, సమర్పణ:రాజ్ కందుకూరి, నిర్మాత:గిరిధర్ మామిడిపల్లి, దర్శకత్వం:గోవి.