పూర్తికావస్తున్న వజ్రాల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.ఎస్.ఎల్. ఫిలింస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కిరణ్, సుమి, గిడ్డేష్, సమీరా ప్రధాన తారాగణంగా శేఖర్ చంద్ర దర్శకత్వంలో కరే శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వ్రజాల వేట’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, మాస్ అడ్వెంచరస్, హారర్ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోందని, దీంతోపాటుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నామని తెలిపారు. మహానంది, నంద్యాల, గాజులపల్లె, ఓర్వకల్లు, కర్నూలు తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, 70 మంది ఆర్టిస్టులపై ఛేజింగ్ ఎపిసోడ్ డబుల్ కెమెరాతో చిత్రీకరించడం ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని, అలాగే విలన్ గ్యాంగ్‌ను ఆటపట్టించే సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. ఒకేసారి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఆ థ్రిల్లింగ్ ఎలాగుంటుంది అన్న కథ, కథనంతో ఈ సినిమా సాగుతుందని, అది సాధించడానికి అడవికి వెళ్లిన హీరో హీరోయిన్లు, విలన్లు చివరికి ఏం సాధించారు అన్న కథ, కథనంతో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. వినోద్‌కుమార్, శివ సత్యనారాయణ, హుస్సేన్, మహేశ్వరాచారి, నందిని, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బి.వి. రావు, నిర్మాత:కరే శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శేఖర్ చంద్ర.