రాజకుమారిగా కాజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం సెనే్సషన్ అవుతూనే వుంది. నిన్నటివరకూ ఆడియో డేట్, రిలీజ్ డేట్‌పై నెలకొన్న సెనే్సషన్ ఇపుడు ఈ సినిమాలో పవన్ పక్కన హీరోయిన్‌గా నటించిన కాజల్ అగర్వాల్ చుట్టూ చేరింది. ఎందుకంటే ఈ సినిమాలో కాజల్ రాజకుమారి పాత్రలో కనిపించనుంది కనుక. రాజకుమారి అంటే రాజులు, రాజ్యాలు కాదులెండి, ఓ గ్రామానికి మాత్రమే కాజల్ రాజకుమార్తె శైలిలో వ్యవహరించనుంది. ఇదే విషయాన్ని ఈమధ్య ఓ సందర్భంలో కాజలే స్వయంగా బయటపెట్టింది. అలాగే సినిమాలో పవన్‌కళ్యాణ్‌తో కలిసి నటించడం చాలా గొప్పగా అనిపించిందని, ఆయనతో తనకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేయగలిగానని తెలిపింది. ఇకపోతే గతంలో కాజల్ రాజకుమార్తెగా నటించిన మగధీర భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ సినిమా కూడా అంతటి ఘనవిజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.