రాజ్‌తరుణ్‌కు జోడీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉయ్యాల జంపాల, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21 ఎఫ్’, ఇలా వరుస హిట్స్‌తో తెలుగులో అతికొద్దిమందికే సాధ్యమైన హ్యాట్రిక్ ఫీట్‌ను కెరీర్ ప్రారంభంలోనే సొంతం చేసుకున్న హీరో రాజ్‌తరుణ్. త్వరలోనే ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌లో ‘శతమానం భవతి’ అనే సినిమా చేయనున్న విషయం తెలిసిందే. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజ్‌తరుణ్ సరసన హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మలయాళంలో సంచలనం సృష్టించిన ‘ప్రేమమ్’ సినిమాతో పాపులర్ అయిన అనుపమ, ఆ సినిమా తెచ్చిన క్రేజ్‌తోనే తెలుగులో వరుస అవకాశాలను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ‘ప్రేమమ్’ తెలుగు రీమేక్, త్రివిక్రమ్ ‘అ..ఆ’ తదితర సినిమాల్లో నటిస్తోన్న అనుపమ పరమేశ్వరన్, రాజ్‌తరుణ్ సినిమాలో కూడా నటించనుండడం విశేషం.

అనుపమ పరమేశ్వర్