త్వరలో నాన్న నేను వర్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ ఓమ్ డి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అజ్మీర చందూ దర్శకత్వంలో ఆదర్శబాబు, పావని జంటగా రూపొందించిన చిత్రం ‘నాన్న.. నేను.. వర్ష’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, నిర్మాత ఎ.ఎస్.రావుకు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను రూపొందించడానికి ముందుకు వచ్చారని, హీరో కొత్తవాడైనా పక్కింటి అబ్బాయిలా కనిపించి నటించారని, అతని డాన్సులు, ఫైట్లు, డైలాగులలో కొత్తదనం ఎక్కడా కనపడదని తెలిపారు. 12 గెటప్‌లలో హీరో చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయని, అన్ని వాణిజ్య హంగులతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఓ అందమైన ప్రేమకథతో వైవిధ్యమైన కథనంతో రూపొందిన ఈ చిత్రంలో పాటలన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయని, అదేవిధంగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకముందని నిర్మాత ఎ.ఎస్. రావు తెలిపారు.బస్ట్ఫా కోటేశ్వరరావు, చలాకి చంటి, స్నేహ, హారిక, గంగూభాయి, దిలీప్, రాము, శివ, శోభ, శ్రావణ్ రఘు, మంగులాల్, సమీర, అక్షయ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: విశ్వజిత్ చందు, దాస్, ఆదిత్య లక్ష్మణ్, సంగీతం:డేవిడ్, కెమెరా: డి.విజయకుమార్, ఎడిటింగ్: అనిల్‌రాజ్, రచన, దర్శకత్వం: అజ్మీర చందు.

పావని