మహర్షి వచ్చేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ‘మహర్షి’ టైటిల్‌ను ఖరారు చేశారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌తోపాటు టీజర్‌ను విడుదలచేశారు. మహేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే డెహ్రాడూన్, హైదరాబాద్, గోవాలలో రెండు షెడ్యూల్స్ జరుపుకుంది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తారట. ప్రస్తుతం మహర్షిగా మహేష్ ఫస్ట్‌లుక్ అందరిలో ఆసక్తి రేపుతోంది.