గూఢచారి సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడివి శేష్, శోభితా ధూళిపాళ జంటగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, విస్తా డ్రీం మర్చంట్స్, పీపుల్స్ మీడియా బ్యానర్లపై తెరకెక్కిన గూఢచారి చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- అందరూ అద్భుతంగా పనిచేశారు. కొత్త జనరేషన్, నటీనటులు, టెక్నీషియన్లు మీరే తెలుగు సినిమా భవిష్యత్తు. మీతోపాటే నేనూ ప్రయాణం చేయాలనుకుంటున్నాను. లేదంటే వెనుకబడిపోతాను. సినిమా చూస్తున్నంతసేపూ ఇది ఎలా తీశారో షాక్ అయ్యాను. ముఖ్యంగా బడ్జెట్ గురించి తెలుసుకొని ఆశ్చర్యమేసింది. ఇప్పటివరకూ మేం చేస్తున్న సినిమాలను చూసి అంత సోంబేరులా, బద్ధకస్తులా, సినిమా తీయడం మాకు తెలియదా అనిపించింది. సినిమాటోగ్రాఫర్ సునీల్ గురించి చెప్పాలి. 17 రోజులు అన్నపూర్ణలో షూట్ చేశారు. అసలు నాకు తెలియని లొకేషన్స్ ఉన్నాయా అని సిగ్గేసింది. దర్శకుడు శశి, అడివి శేష్, అబ్బూరి రవి సినిమాను అద్భుతంగా చక్కదిద్దారు. నటీనటులు కూడా అద్భుతమైన నటనను కనబరిచారు. ఇలాంటి సినిమా ఎవరైనా చేస్తారా అని ఎదురుచూశాను. ఎందుకంటే, నేను క్రియేటర్‌ని కాదు. అందుకే దర్శకులు, రచయితలపై ఆధారపడతాను. నేను జెలస్‌గా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ ఏడాది ఇన్ని సినిమాల్లో తిప్పికొడితే మూడు సినిమాలే హిట్. అందులో రంగస్థలం, మహానటి, ఇపుడు గూఢచారి. మిగతా సినిమాల గురించి తక్కువచేయడంలేదు. ఉన్న బడ్జెట్‌లో ఎంత బాగా తీశారనేది ముఖ్యం. ఎలా డబ్బులు వసూలు చేసిందన్నది పాయింట్. ఓ స్పై సినిమా తెలుగులో ఆడుతుందంటే, ప్రేక్షకుల్లో వచ్చిన మార్పే కారణం. ఈ సందర్భంగా టీమ్‌ను అభినందిస్తున్నాను అన్నారు.