అరవింద.. టీజర్ వస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవింద సమేత వీర రాఘవ చిత్రం టీజర్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా త్రివిక్రమ్ ప్రస్తుతం ఈ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్ర టీజర్‌ని కూడా విడుదల చేసి తారక్ అభిమానులతోపాటు ప్రేక్షకులను కూడా అలరించడానికి టీజర్ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసింది చిత్ర బృందం. టీజర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఇక ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.