నన్ను దోచుకుందువటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసిన సుధీర్‌బాబు హీరోగా, సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే...’ ఈ చిత్రంలోని ‘వౌనం మాటతోటి..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. అజనీష్ లోకనాథ్ సంగీతమందించటంతోపాటు గాయకుడిగా మెప్పించాడు. ప్రముఖ రచయిత శ్రీ మణి సాహిత్యమందించారు. విజయ్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్ టీజర్‌తో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పాటతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కానె్సప్ట్ డిఫరెంట్‌గా ఉండడం.. హీరో, హీరోయిన్ పెర్‌ఫార్మెన్స్ ఫ్రెష్‌గా అనిపించడంతో అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజర్‌గా సుధీర్‌బాబు నటించగా... అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభానటేశ్ కనిపించింది. రొమాంటక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రెడీ అవుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వినాయక చవితి పర్వదినాన సెప్టెంబర్ 13న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న స్పెషల్ ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... సుధీర్‌బాబుగారు హీరోగా సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్న నన్ను దోచుకుందువటే చిత్రానికి సంబంధించిన టీజర్‌ని జూలై 14న రిలీజ్ చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘వౌనం మాటతోటి’ లిరికల్ వీడియోను విడుదల చేశాం. అజనీష్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ పాటను ఆయనే పాడటం విశేషం. శ్రీమణిగారు మంచి మెలోడియస్ సాహిత్యం అందించారు. ఈ రోజు విడుదల చేసిన పాటతోఈ చిత్రంలోని మిగిలిన పాటలు ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మ్యూజికల్‌గా మంచి ఆల్బమ్ అందించారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్‌కి అందరూ కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు సిద్ధవౌతున్నాం. సెప్టెంబర్ 12నే ప్రీమియర్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. సమ్మోహనం లాంటి మంచి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత సుధీర్‌బాబుగారి నుంచి వస్తున్న చిత్రం కావటంతో ప్రేక్షకుల నుంచి అంచనాలు భారీగా వున్నాయి. సుధీర్‌బాబుగారి ఫస్ట్ ప్రొడక్షన్‌లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. సమ్మోహనం సూపర్‌హిట్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సుధీర్‌బాబుగారికి స్పెషల్‌గా థాంక్స్ తెలియజేస్తున్నాను. సినిమా అనుకున్న ప్రకారం పూర్తిచేశాం. సినిమా మీదున్న నమ్మకంతో ప్రమోషన్‌ను కూడా భారీగా ప్లాన్ చేశాం. అందుకు ఈ చిత్ర ప్రమోషన్‌లో తెలుగు ప్రేక్షకులందరినీ ఇన్‌వాల్వ్ చేస్తున్నాము. అలాగే ఈ చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకూడదనే సంకల్పంతోనే సుధీర్‌బాబుగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు అని అన్నారు.