కురుక్షేత్రంలో అర్జున్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్షన్ హీరో అర్జున్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటించినా, క్యారెక్టర్ పోషించినా... ఆయన స్థానం ప్రత్యేకం. అందుకే అభిమానులు ఆయన సినిమాకోసం ఎదురుచూస్తుంటారు. మరి అలాంటి యాక్షన్ హీరో అర్జున్ నటించిన 150వ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. యాక్షన్‌కింగ్ అర్జున్ నటించిన 150వ చిత్రం కురుక్షేత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయికృష్ణ పెండ్యాల కోప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ... మన యాక్షన్ కింగ్ అర్జున్ రీసెంట్‌గా నటించిన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘అభిమన్యుడు’ సినిమాలతో ఓ జెనరేషన్ ఆడియెన్స్‌కి మరింత దగ్గరయ్యాడు. అలాంటి అర్జున్ అంటే తెలుగు ప్రేక్షకులకు అమితమైన ప్రేమ. చాలామందికి కష్టసాధ్యమైన ఫీట్‌ను అర్జున్ ఇప్పుడు సాధించారు. అదే 150వ చిత్రం. అర్జున్‌గారు నటించిన 150వ చిత్రం కురుక్షేత్రంను గ్రాండ్ లెవల్లో తెలుగులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని మంచి ప్రశంసలు అందుకున్నారు. సెన్సార్ రిపోర్ట్ ఫుల్ పాజిటివ్‌గా రావడంతో చాలా హ్యాపీగా ఉన్నాం. ఈసారి అర్జున్‌గారు యాక్షన్‌కి థ్రిల్లింగ్ ఎలిమెంట్సని యాడ్ చేసి మరోసారి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ థ్రిల్లర్స్‌ని తలపించేలా ఉందనే కామెంట్స్ అందుకుంది. అర్జున్ ఇప్పటివరకూ పోలీస్ పాత్రలు చాలా చేసినా ఒక భిన్నమైన పోలీస్ అధికారిగా ఇందులో కనిపించబోతున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ వంటి స్టార్స్‌ని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్యనాథన్ కురుక్షేత్రంను ఆద్యంతం ఆసక్తిగా మలిచారు. ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనాలతో ప్రేక్షకుల ఆలోచనలకు అందని థ్రిల్లర్‌గా కురుక్షేత్రం అలరించబోతుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్‌తోపాటు ప్రసన్న, వరలక్ష్మి, శరత్‌కుమార్, సుమన్, సుహాసిని, వైభవ్, శ్రుతి, హరిహరన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.