అదే ఫ్యాషన్‌తో సినిమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్ర శ్రీ ఫిలిమ్స్, జి.బి.మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్.1గా మరిడి శ్రీనివాస్ నిర్మాతగా పరిచయమవుతూ మాల్యాద్రి మామిడి (ప్రదీప్) దర్శకుడిగా పరిచయంచేస్తూ ఓ కొత్త చిత్రం మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మరిడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను గతంలో సినిమా రచయతగా అవకాశాలకోసం ప్రయత్నాలు చేయడం జరిగింది. అప్పట్లో కుదరలేదు. తరువాత మా బిజినెస్ వర్క్స్ ఉండి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు అదే ఫ్యాషన్‌తో సినిమా తీయాలి అని అనుకుంటున్న సమయంలో నాకు మాల్యాద్రి మామిడి నన్ను కలవడం జరిగింది. నాకు చెప్పిన కథ చాలాబాగా నచ్చి కథ వింటున్నంత సేపు తర్వాత ఏం జరగబోతోంది అనే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ కథ జరుగుతుంది. నాకు బాగా నచ్చాయి కథ విన్న వెంటనే ప్రీప్రొడక్షన్ పూర్తిచేసుకుని త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్నాం. అలాగే ఈ చిత్రం కాకుండా మరికొన్ని చిత్రాలు బడ్జెట్‌లో నిర్మించాలని వజ్ర శ్రీ బ్యానర్ నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాల్యాద్రి మామిడి(ప్రదీప్) మాట్లాడుతూ వజ్రశ్రీ ఫిలిమ్స్, జి.బి.మూవీస్ బ్యానర్‌లో నా మొదటి సినిమా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత మరిడి శ్రీనివాస్‌గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను కథ చెప్పగానే శ్రీనివాస్‌గారు మొదటి సిట్టింగ్‌లోనే ఈ కథని దర్శకుడిగా నన్ను ఓకే చేసేసారు బడ్జెట్ విషయానికి వస్తే శ్రీనివాస్‌గారు అనుకున్న దానికంటే ఎక్కువే అవుతుంది అని చెప్పినా ఎక్కడా వెనకాడకుండా నువ్వు ముందు మిగతా పనుల్లో ఉండు అని నాకు ధైర్యాన్నిచ్చారు. మా మూవీ హీరోహీరోయిన్ విషయానికి వస్తే హీరోగా ఒక మూవీలో ప్రూవ్ చేసుకున్న ప్రముఖ యంగ్ బ్యూటీఫుల్ హీరోని ఎంపిక చేయడం జరిగింది. వెంటనే కథకు అనుగుణంగా బాడీ వర్కవుట్ చేస్తున్నారు. ఫుల్‌గా రెడీఅయిన తరువాత ఫస్ట్‌లుక్‌లో హీరో అనౌన్స్ చేద్దామని ఇప్పుడు ప్రకటించడం లేదు హీరోయిన్ విషయానికి వస్తే.. ఈ చిత్రం ద్వారా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌ని తెలుగులో పరిచయం చేస్తున్నాం. హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్‌ని త్వరలో పరిచయం చేస్తాం అని దర్శకుడు చెప్పారు. ఈ సందర్భంగా డా.బాలరాజశేఖర్ మాట్లాడుతూ.. మా శ్రేయోభిలాషులు శ్రీనివాస్, ప్రదీప్‌గారు ఈరోజు మూవీ అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ సక్సెస్‌అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తన శుభాకాంక్షలు తెలిపారు.