మర్డర్ మిస్టరీతో ‘డిటెక్టివ్..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ మిస్టర్ ఆంధ్రా బల్వాన్, శ్రావణి హీరోహీరోయిన్లుగా మజ్ను ఫిలింస్ పతాకంపై కృష్ణమోహన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మజ్ను బ్రదర్స్ ఎస్.ఎం.సంధాని భాషా, మజ్ను సోహ్రాబ్ నిర్మాతలుగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘డిటెక్టివ్ భాస్కర్’ షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మజ్నుబ్రదర్స్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మూడు ఫైట్లు, రెండు ఛేజింగులు, ఐదు పాటలు ఉన్నాయి. భరత్‌బంద్ విజయ్‌శేఖర్ సంగీత దర్శకత్వంలో పాటలు అద్భుతంగా వచ్చాయి. ఏడు రాత్రులు తీసిన వాన పాట సినిమాకే కాకుండా, వాన పాటల్లోనే హైలెట్‌గా నిలుస్తుందని, త్వరలో ఆడియోని విడుదల చేసి సినిమాను దసరాకు రిలీజ్ చేయటానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నాం అని అన్నారు. దర్శకుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలను వణుకు పుట్టించిన ఓ మర్డర్ మిస్టరీని ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏ విధంగా చేధించాడన్నది చిత్ర కథాంశమని, అనుక్షణం ఉత్కంఠ భరితంగా సాగుతుంటుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. ఇంకా ఈ చిత్రంలో వౌనిక, సాయికిరణ్, ప్రాచి, సత్యప్రకాష్, జీవా, గౌతంరాజు, అన్నపూర్ణమ్మ, దిల్ రమేష్, శివ సత్యనారాయణ, మిమిక్రీ మూర్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, ఎడిటింగ్: సాయిశ్రీనివాస్, ఫైట్స్: సూపర్ ఆనంద్, సంగీతం: భరత్ బంద్ విజయ్‌శేఖర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ఎం.ఎం.ఖాజా, నిర్మాతలు: ఎస్.ఎం.సంధానిభాషా, మజ్నుసోహ్రాబ్, దర్శకత్వం: కృష్ణమోహన్.