భాగ్యనగరం ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.వి.రాజు దర్శకత్వంలో కన్నడంలో రాజధాని పేరుతో రూపొంది మంచి విజయం సాధించిన చిత్రాన్ని ‘్భగ్యనగరం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు సంతోష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సంతోష్‌కుమార్. కన్నడ హీరో యశ్, షీనా జంటగా ప్రకాష్‌రాజ్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముమైత్‌ఖాన్ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిర్మాత డి.ఎస్.రావు మాట్లాడుతూ- ఉజ్జ్వల భవిష్యత్ కలిగిన యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు, మద్యపానం వంటి దుష్పరిమాణాలను ఎత్తిచూపుతూ ఆలోచన రేకెత్తించేలా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉంది అన్నారు. నిర్మాత సంతోష్‌కుమార్ మాట్లాడుతూ- డబ్బింగ్ సినిమాతో నిర్మాతగా అడుగుపెడుతున్నాం. త్వరలోనే స్ట్రెయిట్ సినిమా చేయనున్నాం. కన్నడంలో మంచి విజయం సాధించిన రాజధాని చిత్రాన్ని భాగ్యనగరం పేరుతో విడుదల చేస్తున్నాం. సందేశంతోపాటు మంచి వినోదం జోడించిన సినిమా ఇది. తప్పకుండా తెలుగులో మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.