కేడీ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ షకలక శంకర్ హీరోగా ఖుషీ గడ్వీ, గుర్లిన్ చోప్రా హీరోయిన్లుగా జానీ దర్శకత్వంలో శ్రీ వీరభద్రస్వామి ఫిలింస్ పతాకంపై డి.గిరీష్‌బాబు నిర్మిస్తున్న చిత్రం ‘కేడీ నెం.1’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ సీనియర్ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ విడుదల చేశారు. అనంతరం జరిగిన మీడియా మీట్‌లో ఆయన మాట్లాడుతూ- ఫైనాన్షియల్‌గా గిరీష్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన నిర్మాతగా మారి చేస్తున్న మొదటి చిత్రమిది. దర్శకుడిగా జాని మంచి విజన్ వున్న వ్యక్తి. హీరోగా శంభో శంకర చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్‌కు మరో మంచి విజయాన్ని అందించాలి అన్నారు. షకలక శంకర్ మాట్లాడుతూ- కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. దర్శకుడు జాని ప్రతి విషయంలో సపోర్టు అందిస్తూ నన్ను కొత్తగా చూపిస్తున్నారు. ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది అన్నారు. నిర్మాత గిరీష్ బాబు మాట్లాడుతూ- నిర్మాతగా ఇది నా మొదటి చిత్రం. మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. మరో 15 రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది. పూర్తిస్థాయి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కె.వి.వి.సత్యనారాయణ సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం అన్నారు. దర్శకుడు జాని మాట్లాడుతూ- 22 ఏళ్ళుగా పరిశ్రమలో ఉన్నాను. దర్శకుడిగా నాకిది మొదటి చిత్రం. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గిరీశ్‌కు కృతజ్ఞతలు. షకలక శంకర్ కమిట్‌మెంట్ వున్న వ్యక్తి అన్నారు.