మహా ఆశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ హన్సికకు ఈమధ్య పెద్దగా కలిసి రావడం లేదు. తమిళంలోనే సెటిల్ అయిన ఈ భామకు సరైన సక్సెస్ దక్కడంలేదు. ఇటీవలే ప్రభుదేవతో కలిసి గుళేబకావళి అంటూ ఎంటర్‌టైన్ చేయాలని చూసింది. కానీ అది వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం మంచి సక్సెస్ వస్తే తప్ప ఈ కెరీర్ ముందుకు సాగడం కష్టమే. అందుకే తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించేందుకు ఓకె చెప్పింది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి జమీల్ దర్శకత్వం వహించనున్నాడు. మహా పేరుతో ఈ చిత్రం రూపొందనుందని, విభిన్నమైన కథనంతో తెరకెక్కుతుందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాపై హన్సిక చాలా ఆశలు పెట్టుకుంది. మహా సక్సెస్ అయితే తన కెరీర్ గాడిలో పడుతుందని ఈమె ఆశ. మరోవైపు టాలీవుడ్‌లో అవకాశాలు అందుకునే దిశగా పలు దర్శకులతో చర్చలు జరుపుతోందట. ఏదేమైనా సక్సెస్ ఉంటే తప్ప అవకాశాలు వచ్చేలా లేవు. అందుకే ఆమె మహాపైనే ఫోకస్ పెట్టింది.

చిత్రం..హన్సిక