బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాగంటి శ్రీనాధ్, సాన్వి మేఘన జంటగా నాగసాయి దర్శకత్వంలో ఎం.ఎస్.క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’. గోరటి వెంకన్న పాడిన ప్రచార గీతాన్ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. గీత రచయిత సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సాహిత్యానికి చిన్నా పెద్దా లేదని దాసరిగారు చెప్పేవారని, చిన్న హీరోకు పాట రాసినా స్టార్ హీరో సినిమాకు పనిచేస్తున్నానని భావించాలని అనేవారు. ఆ మాటను నిత్యం పాటిస్తున్నాను. ఈ సినిమాతో దర్శక నిర్మాతలు ఓ మంచి ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ- ఈ సినిమాను వ్యాపార రీత్యానే నిర్మిస్తున్నాను. కొత్త తరహా కథ, కథనాలతో ఈ సినిమా తీశాం. పోలీసు కథల్లో ఇలాంటి సినిమా రాలేదని చెబుతున్నాను. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల చేస్తామన్నారు. దర్శకుడు నాగసాయి మాట్లాడుతూ- దాదాపు 200 పోలీస్‌స్టేషన్లకెళ్లి అక్కడి కేసులను పరిశీలించి ఈ కథను తయారు చేసుకున్నానన్నారు.