ప్రపంచాన్ని మార్చే యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వ, వెంకట్, వృషాలి, హర్షద్ పాటిల్, రాజ్‌బాల ప్రధాన పాత్రల్లో రవిచరణ్.ఎం దర్శకత్వంలో లక్ష్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరెకెక్కుతున్న చిత్రం మైత్రీవనం. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లోని తారమతి బారదారిలో విడుదలయ్యాయి. నిర్మాత మల్కాపురం శివకుమార్, కల్వకుంట్ల కన్నారావు సీడీలను విడుదల చేశారు. అనంతరం శివకుమార్ మాట్లడుతూ- పాటలు బాగున్నాయి. ట్రైలర్ ఆకట్టుకుంటుంది. చిన్న చిత్రాల్లో చాలా సృజనాత్మకత ఉంటుంది. తప్పకుండా మంచి విజయం సాధించాలి అన్నారు. నిర్మాత సుకేష్ ఈశ్వర్ మాట్లాడుతూ- ఓ చిన్న ఆలోచనతో మొదలైన చిత్రమిది. దర్శకుడు రవి చెప్పిన అంశం నచ్చి ఈ సినిమా చేస్తున్నాం. సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు. దర్శకుడు రవిచరణ్ మాట్లాడుతూ- యువతలో వున్న అపారమైన శక్తి ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చెయ్యగలదు. ఆ శక్తిని యువత గుర్తించాలనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కించాం. పూర్తి స్థాయి వినోదాత్మకంగా సాగుతూ సందేశం ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.