పాటల్లో నీవెవరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ హీరో హీరోయిన్లుగా హరినాధ్ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్ ఎం.వి.వి సినిమా బ్యానర్స్‌పై కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ‘నీవెవరో’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు. సీడీని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి విడుదలచేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ- నిన్నుకోరి సినిమాతో ఆది మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఈ సినిమా గురించి తను నాకు చెప్పేశాడు. తను మంచి నటుడు. మంచి రోల్స్ అతను కాకుండా ఇంకెవరూ చేయలేరు. తప్పకుండా ఈ సినిమా తనకి మంచి సక్సెస్‌నిస్తుంది. అలాగే కోన వెంకట్ సినిమా విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. తప్పకుండా ఈ సినిమా తరువాత దర్శకుడు హరి క్రేజీ దర్శకుల లిస్టులో నిలిచిపోతారు అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ- ఈ సినిమాలో వెనె్నల పాట చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. రైటర్‌గా 20 ఏళ్లు పనిచేసిన తరువాత ఓ అనే్వషణ మొదలైంది. సినిమాల్లో ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్ ఉండిపోయింది. దాంతో గీతాంజలి సినిమా చేశాను. అది పెద్ద విజయం సాధించింది. అలాగే నిన్నుకోరి సినిమాతో శివ లాంటి దర్శకుడిని పరిచయం చేశాను. కొత్త టాలెంట్‌ను మంచి కంటెంటెకు ఫ్లాట్‌ఫామ్ ఇవ్వాలని కోన ఫిలిం కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా బ్యానర్లను మొదలుపెట్టాను. మంచి కథతో వున్న సినిమాలే చేస్తాం. ఈ సినిమాలో నటించిన తాప్సీ, రితిక అద్భుతంగా చేశారు అన్నారు. ఆది మాట్లాడుతూ మనం ఓ పనిని నమ్ముకుని నిజాయితీగా పనిచేస్తే అదే నీకు తిండి పెడుతుందన్న విషయాన్ని నాన్న నుంచి నేర్చుకున్నాను. ఈ సినిమా విషయంలో అందరం కష్టపడ్డాం. కోన వెంకట్ లేకుంటే సినిమా లేదు. ఆయన బెస్ట్ టీమ్‌ను ఇచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆగస్టు 24న వస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు.