విజయ్ పెద్ద స్టార్ అవుతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్-2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘గీతగోవిందం’. ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతున్న సందర్భంగా ప్రి రీలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ- ఈ చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయి. సర్వీస్ ప్రొవైడర్ చేతకానితనంవల్ల బయటికి వచ్చాయి. ఆ క్లిప్పింగ్స్‌ని స్టూడెంట్స్ షేర్ చేశారు. దానివల్ల 17 మంది స్టూడెంట్స్‌ని అరెస్టు చేయాల్సి వచ్చింది. ఈ విషయంపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. బయటికి వచ్చిన క్లిప్పింగ్‌వల్ల నష్టం ఏమీ లేదు కానీ రాబోయే రోజుల్లో వచ్చే పెద్ద సినిమాల గురించే నా బాధ. చిన్న పొరపాటువల్ల మీరు, మీ కుటుంబాలు బాధపడతాయని చెబుతున్నాను. ఈ సినిమా ఫలితం గురించి ఎలాంటి టెన్షన్ లేదు. దర్శకుడు తనకు కావాల్సిన అంశాలను అద్భుతంగా రాబట్టాడు. విజయ్ భవిష్యత్తులో పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు. ఖచ్చితంగా వంద సినిమాలు చేసే నటుడవుతాడు అన్నారు.