ఎవడు కాంబినేషన్ రిపీట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం రామ్‌చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 70 శాతంపైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జగదేకవీరుడు అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమా తరువాత చరణ్, రాజవౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు ఆయన మరో చిత్రానికి ప్లాన్ చేశాడట. ప్రస్తుతం మహేశ్‌తో మహర్షి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వంశీ పైడిపల్లితో సినిమా వుంటుందట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎవడు చిత్రం మంచి విజయం సాధించింది. టెక్నికల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు అప్పటినుంచే చరణ్ ఆసక్తిగా ఉన్నాడు. తాజాగా వీరిద్దరిమధ్య చర్చలు జరిగాయని టాక్. మహేష్ సినిమా పూర్తికాగానే వంశీ చరణ్ సినిమాకోసం ప్లాన్ చేస్తాడట.