జాతిపితకు గీత నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జాతికి స్వాతంత్య్ర సాధక నేత, జాతిపితగా కీర్తింపబడ్డ మహనీయుడు మహాత్మాని కీర్తిస్తూ, స్మరిస్తూ వ్రాసిన కొన్ని గీతాలను పరిశీలిద్దాం..
1938 ప్రాంతాల్లో వచ్చిన సారథీ రామబ్రహ్మంగారి ‘మాలపిల్ల’ చిత్రంలో బసవరాజు అప్పారావు వ్రాసిన ‘కొల్లాయి గట్టితేనేమి’ మా గాంధీ మాలడై తిరిగితేనేమి’అంటూ కథాపరంగా వ్రాసిన గీతం ఆరోజుల్లో ప్రాచుర్యం పొందింది. రాట్నంతో వడికిన నూలుతో తయారైన ఖద్దరు ఉపయోగించమని ఆయన ప్రచారం చేశారు. 1941లో వచ్చిన డాక్యుమెంటరీ చిత్రం ‘మహాత్మాగాంధీ’లో తాతాజీ తాపీ ధర్మారావు వ్రాసిన గీతాల్లో చెప్పుకోదగ్గ పంక్తులు.. ‘‘పాడవే రాట్నమా ప్రణవ భారతగీతి/ ఏడు దీవులలోను ఏ పారు నీ ఖ్యాతి/ ఆడవే కదుర- నీ ఆటయే మా కోట/ వేడుకే నీ నూలు లేత వనె్నల చాలు/ నీ దారమే జవనాధారమె ధాత్రి/ నీ సూత్రియే మాకు నిత్య మంగళ సూత్రి/ విశ్వసోదర భావ విజ్ఞాన విభవమ్ము/ వెలయించి ఖండాంతర విలయంబు మనస్సనే/ ఏడు సంద్రాలలో వాడవాడల లోన/ పాడవే మా గాంధి కళ్యాణమయగీతి
(గానం: టంగుటూరి సూర్యకుమారి)
మరో చిరస్మరణీయ గీతం.... ఎదురు చూడనీవే గాంధీ- ఏ దెసకెగ అంతట/ నీ మహిమేగా గాంధీ/ భారతశోభ భూమిలో జూపి/ శాంతి సమరమున సాధనచేసి/ మాతృసేవ మహిమ చాటే/ శాంతి హృదయ మహిత సదయ
హోటలులోన ఎదురే గాంధీ/ క్యాలెండర్‌పై మోహనగాంధీ (గానం: శ్రీమతి రాజరత్నం)
ఇక ప్రముఖ గాయని శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి ఆలపించిన అసంఖ్యాక గీతాలలో మహాత్మాగాంధీని స్తుతిస్తూ పాడిన, ప్రాచుర్యం పొందిన (1940-50) గీత త్రయం వుదహరించాల్సిందే. అవి.... ఇదే జ్యోత- నీకిచె జ్యోత ఓ స్వతంత్ర భారతపిత/ పరిపాలనలో, దాస్యంబుధిలో/ తెరువు నెరుంగని దీర్ఘనిద్రలో/ మరగిని నరులకు- సత్యాగ్రహమ్మను/ వజ్రాయుధమ్ము నొసంగిననేత/ మన్నికగలిగిన నరజాతులలో/ ఎన్నిక గలదోయే మన జాతిమనని/ మాకొక దేశం- నాకొక జెండా/ మాకొక వున్నతి నిచ్చిన నేత/ నీకిదే జోత- వో స్వతంత్ర భారత పిత
***
పోర్‌బందర్ కోమటింట పుట్టినాడోయ్/ పురుషోత్తముడు- జగతిమెట్టినాడోయ్/ కొత్త ఏసుక్రీస్తు అవతరించినాడోయ్/ కొట్టకె- పగవాళ్ళ పొగరు దించినాడోయే/ హిందూ పైగంబర్ జన్మించి నాడోయ్/ అల్లాహో అక్బరంటూ అరచినాడోయ్/ రాతినాతి జేసిన శ్రీరాముడెనోయ్/ ధర్మముపై ప్రాణపందెమెండినాడోయ్/ తాళలేక శత్రువులు తలక్రిందైరోయ్/ చేతులు పైకెత్తి పగేల నండోయ్/ బాపూజీ ప్రపంచపు మా బాస్ అనండోయ్/ ‘మోహననామా, మంగళ నామా’అన్న పల్లవిగల గీతంలో... అహింసాసూత్ర- రచనా పవిత్రా/ హరిజన మిత్రా- పరమ చరిత్ర/ నవయుగ నాటక నాంది నాయక/ గాంధీ నామక శుభ సంభాయక/ భారతదేశ శతృవినాశా/ స్వతంత్ర భారత దేశాధీశా...అంటూ ప్రస్తుతించారు. 1955లో వచ్చిన ‘దొంగరాముడు’చిత్రంలో రచయత సీనియర్ సముద్రాల గాంధీజీ శారీరక రూపాన్ని మానసిక ధైర్యాన్ని అర్థవంతంగా ఆవిష్కరించిన గీతం. (నిర్మాత: దుక్కిపాటి మధుసూధనరావు)
బలే తాత మన బాపూజీ- బాలల తాత బాపూజీ/ బోసి నవ్వుల బాపూజీ/ చిన్నీ పిలకా బాపూజీ/ కులమత భేదం వలదన్నాడు/ కలిసి బ్రతికితే బలమన్నాడు/ మానవులంతా ఒకటన్నాడు/ మానవులంతా ఒకటన్నాడు/ మనలో జీవంపోశాడు... ॥
నడుం బిగించి లేచాడు/ అడుగుముందుకు వేశాడు/ కదంతొక్కుతూ, పదం పాడుతూ/ దేశం దేశం కదిలింది/ గడగడలాడెను సామ్రాజ్యం/ మనకు లభించెను స్వారాజ్యం... ॥
సత్యాసింసలె శాంతిమార్గమని/ జగతిని జ్యోతిని చూపించాడు/ మానవ ధర్మం బోధించాడు/ మహాత్ముడై యిల వెలిశాడు... ॥
ఆనాటి గాంధీ ఆశలను ఆశయాలను వివరించి, అందుకు భిన్నంగా ఆయన అనుచరులే కొందరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఎం.ఎల్.ఎ. చిత్రంలో ఆరుద్ర అర్థవంతంగా విశే్లషించారు. ఆ గీతం- (నిర్మాత: కె.బి.తిలక్)
‘నమో నమో బాపు- మాకు/ న్యాయమార్గమే చూపు/ నిరంతరం మా హృదంతరంలో/ నిండి వెలుగు జ్యోతి నిత్యసత్యకాంతి/ ధర్మదేవత నాలుగు పాదములు/ బ్రాహ్మదేవుని ఆ నాలుగు వేదములు/ ధర్మభూమిలో మరలా నిలిపి/ నిర్మల బోధలుచేసిన బాపూ... ॥
నీవు తీసిన మాటలు దాటి/ నీతిని విడిచి నినే్న మరచి/ నీ అనుచరులే మారెదరెమో/ నిదురనుండి లేవు- బాపూ... ॥
ఆశయాలకై అసువులు బాసిన/ అమర మూర్తివయ్యా- నీవు/ ఆత్మబలముతో- ఆదర్శాలు/ అవనిలోన నిలుపు బాపూ/ ‘ధర్మపత్ని’ చిత్రానికి సినారె. వ్రాసిన పల్లవి- ‘కాకమ్మా చిలకమ్మా కథలే మాకొద్దు/ మా గాంధీ చెప్పింది మాకెంతో ముద్దు’/ ‘గాంధీ పుట్టినదేశం’అనే టైటిల్‌తో వచ్చిన సినిమాలో- ‘గాంధీ పుట్టిన దేశం/ రఘురాముడు ఏలిన రాజ్యం/ యిది సమతకు మమతకు సంకేతం’/ అనే పల్లవితో వ్రాసిన గీతం కూడా ప్రాచుర్యం పొందింది.
ఏమయినా సమాజంపై ప్రభావంచూపిన జాతిపిత గాంధీని కేంద్ర బిందువుగా చేసుకొని గీతం వ్రాసిన మహామహులు స్మరణీయులు. *

- ఎస్.వి.రామారావు