శ్రీనివాసుడి విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూత్‌స్టార్ నితిన్, రాశీఖన్నా, నందితా శే్వత హీరో, హీరోయిన్‌లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ- 15 సంవత్సరాలు.. 30 సినిమాలు చేశాను. ఈ రోజు ఉన్నంత కన్‌ఫ్యూజన్‌లో ఎప్పుడూ లేను. ఇనే్నళ్ల కెరీర్‌లో సక్సెస్ పర్సంటేజ్‌తో ఎక్కువ సినిమాలు చేశాను. అప్పుడప్పుడు స్పీడు బ్రేకులు వచ్చాయి. అలా వచ్చినపుడల్లా మళ్లీ సక్సెస్ సాధిస్తూ వస్తున్నాను. లక్కీగా గత ఏడాది ఇండస్ట్రీలో ఎవరూ చేయలేని విధంగా ఆరు సినిమాలు చేశాను. అన్ని సినిమాలు సక్సెస్‌ఫుల్ అయ్యాయి. మూడు వారాల క్రితం వచ్చిన లవర్ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ సినిమా విషయంలో ముందునుండి ఓ మంచి సినిమా వస్తుందని పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. ప్రివ్యూ చూసినవారు అప్రీషియేట్ చేసినపుడు మాకు మంచి సినిమా చేశామని ఇంకా నమ్మకం పెరిగింది. యుఎస్ నుండి తొలి రివ్యూ వచ్చిన తర్వాత అది కూడా పాజిటివ్‌గానే వచ్చింది. అందరూ చెప్పినట్లుగా మంచి సినిమా చేశామని నమ్మకం కలిగింది. మేం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా చేశాం అన్నారు. చిత్ర దర్శకుడు సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ- డైరెక్టర్‌గా నా పనిని చక్కగా నిర్వర్తించాను. ఏ కథ అయితే చెప్పానో దాన్ని అలాగే తెరపై చూపించాను. దాన్ని నిర్మాత ఫీలై అప్రీషియేట్ చేస్తే దర్శకుడిగా నేను సక్సెస్ అయినట్లే. ఆ సక్సెస్‌ను రాజుగారి ద్వారా నేను పొందాను. నన్ను నమ్మి కథ ఓకే చేసిన హీరో, హీరోయిన్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. అది కూడా నా సక్సెస్. ప్రేక్షకుల అభినందనలే మా ఆశీర్వాదాలు. మంచి సినిమా చేశామనే తృప్తి కలిగింది అన్నారు. నితిన్ మాట్లాడుతూ- నేను డిస్ట్రిబ్యూటర్‌గారి అబ్బాయినే. నాకు కూడా ఈ సినిమా విషయంలో కన్‌ఫ్యూజన్ వుంది. నాకు తెలిసిన సర్కిల్‌లో.. మా పిల్లల పెళ్లిళ్లు కూడా ఇలాగే చేయాలని అనుకున్నవాళ్లు ఉన్నారు. సినిమాను నమ్మి, ప్రేమించి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాపై టాక్‌ను స్ప్రెడ్ చేసి సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను. ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. నా కెరీర్‌లో ఓ గొప్ప సినిమా అన్నారు.