అర్జున్‌రెడ్డితో పోల్చలేం -- హీరో విజయ్ దేవరకొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**పెళ్లిచూపులు.. అర్జున్‌రెడ్డి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఎవ్వరూ ఊహించని క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్‌రెడ్డి సినిమా ఆయన స్టార్‌నే మార్చింది. ఈ ఒక్క సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ తాజాగా గీత గోవిందంగా మన ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్-2 బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన సందర్భంగా హీరో విజయ్ దేవరకొండతో ఇంటర్వ్యూ.. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
------------------------

* సినిమా పరిశ్రమలోకి హీరో అవ్వాలన్న ఫ్యాషన్‌తోనే వచ్చాను. అయితే మరీ ఎక్కువగా కష్టపడుతున్నానేమో అందుకే కాస్త అలసటగా ఉంది.. యంగ్‌లో ఉన్నాను కాబట్టి తట్టుకుంటున్నాను లేదంటే చాలా సమస్య వచ్చేది. వరుసగా సినిమాలు, ప్రమోషన్స్ అంటూ ప్రతిరోజు బిజీగా గడపడంవల్ల కాస్త ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చాయి. బాగా అలసిపోయాను.. ఈ సినిమా తరువాత ఓ వారం గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నా.
* గీత గోవిందం సినిమాలో నా పేరు విజయ్ గోవింద్. ప్రేమకోసం, ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి. ఎంత దూరం అయినా వెళ్ళగలడు. అర్జున్‌రెడ్డిలో కూడా అమ్మాయి ప్రేమకోసం ఎలా ధైర్యంగా వెళ్తాడో అలాగే ఉంటుంది. కానీ ఇద్దరిలో ఒకటే తేడా ఏమిటంటే.. ఇద్దరు ఎంచుకున్న దారులు వేరు. ఈ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది. ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేశా. అయితే అర్జున్‌రెడ్డి విషయంలో అలా కాదు.. అది కావాలని ఆ కథ ఎంచుకున్నాను.. దానికి కావాల్సిన జోనర్ ప్రేక్షకులు చూస్తే చాలనుకున్నాం.. కానీ అందరికీ నచ్చింది.
* ఊహించని ఇమేజ్ దక్కడం నిజంగా అదృష్టంగా ఉంది. దాన్ని అర్థం చేసుకునే పనిలోనే ఉన్నాను. ఒకప్పుడు కన్న కలలు ఇవాళ నిజం అవ్వడం.. అక్కడక్కడా నా సినిమా పోస్టర్స్ చూసి అది నువ్వేరా అని చెప్పుకోవడం.. జనాల్లో నాపై ఉన్న అభిమానం చూసి ఎంజాయ్ చేయడానికి కాస్త టైం పడుతుంది. నేను నమ్మిన పనిని చేసుకుంటూ వెళ్లడమే నా పని.. అంతేకానీ నువ్వు ఈ దారిలోనే వెళ్లు అని ఎవరైనా అడ్వయిజ్ ఇస్తే నాకు నచ్చదు.
* ఈ సినిమాలో ఓ పాట పాడాను. నిజానికి నాకు పాటలు పాడడం అంటే ఇష్టం. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అడగ్గానే పాడాలనిపించింది. పాట కూడా బాగుందని అంటున్నారు. నిజానికి చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలని ట్రై చేశా. కానీ అది కురదలేదు. నాకు రాక్ స్టార్స్, పాప్ సింగర్స్ లైఫ్ స్టయల్ అంటే చాలా ఇష్టం.
* ఒక సినిమా విడుదల తరువాత పైరసీ రావడం మామూలు విషయమే కానీ విడుదలకు ముందే ఇలా సినిమాలోని కొన్ని సీన్స్ బయటకి రావడం నిజంగా బాధేసింది. ఎంతోమంది కష్టపడి సినిమా తీసింది జనాల కోసమే కదా.. ఇలా విడుదలకు ముందే లీక్ చేయడం దారుణం. ఇది కూడా పైరసీ లాంటిదే. ఇలాంటివారిని శిక్షించాలి. ఐతే ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది.
* ఎన్నో అద్భుత సినిమాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా చేయడం లక్కీగా ఉంది. ఇలాంటి ప్రసిద్ధ బ్యానర్‌లో సినిమా అవకాశం రావడం గొప్ప విషయం. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు.

-శ్రీ