వాటి గురించి పట్టించుకోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడంలో హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రష్మిక మండన్న టాలీవుడ్‌లోకి చలో అంటూ సూపర్‌హిట్ అందుకుని ఎంట్రీ ఇచ్చింది. తాజాగా గీత గోవిందంతో మరో హిట్‌ని తన అకౌంట్‌లో వేసుకున్న రష్మిక నటనకు మంచి స్పందన లభిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ -2 బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా రష్మిక చెప్పిన విశేషాలు..

ఫస్ట్‌డే ఫస్ట్ షో..
సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. చాలా ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ విషయంలో కాస్త కష్టం అనిపించింది. ఎందుకంటే తెలుగులో ఇది నాకు రెండో చిత్రం. అన్ని డైలాగ్స్, అంత స్ట్రాంగ్ రోల్ చేయగలుగుతానో లేదో అని కొంచెం భయపడ్డాను. అయినా కథ వినగానే ఓకె చెప్పాను. ఈ పాత్ర విషయంలో కోపంగా కనిపించాలి. అసలు నాకు ఎవరిపై కోపం రాదు. కానీ ఈ సినిమా కోసం ఏడు నెలలు కోపంగానే ఉన్నా. సినిమాలో లాస్ట్ పోర్షన్ కోసం కొంచెం అక్కడక్కడా నవ్వుతూ కనిపిస్తా.. అంతే. సినిమా చూశాక అందరూ నా పెర్‌ఫార్మెన్స్‌ని మెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఓ నటికి ఇంతకంటే ఏం కావాలి?
వాళ్ళను అడగాల్సిందే..
ఏ సినిమా అయినా సంతకం చేసే ముందు నా ఫ్యామిలీ మెంబర్స్‌ని అడుగుతా. కొన్ని సినిమాలు, నాకు చాలా నచ్చినవి వాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేసినా రిక్వెస్ట్ చేసి ఒప్పించుకుంటా. పరశురామ్ ఈ కథని మా ఇంట్లో వాళ్లకు కూడా చెప్పారు. ప్రస్తుతం దేవదాస్‌లో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. నేను ఆ సినిమా చేయడానికి రీజన్ ఉంది. ఇక డియర్ కామ్రేడ్ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్. స్పోర్ట్స్ బేస్డ్ క్యారెక్టర్. క్రికెటర్‌లాగా కన్పిస్తాను. మేకప్ కూడా ఉండదు.
చాలా హ్యాపీగా..
నిజానికి సినిమా పోస్టర్స్‌పై హీరోతో సమానంగా నా పేరు కూడా ఉండటం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఏ హీరోయిన్ అయినా హీరోతో ఈక్వెల్‌గా, డెడికేటెడ్‌గా సినిమా కోసం పనిచేస్తారు. కానీ అంతగా వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. నా గత సినిమాల్లో కూడా పోస్టర్స్‌పై ఎక్కడా నా పేరు మెన్షన్ చేయలేదు. ఈ సినిమాకోసం నా పేరు మెన్షన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు నేను కొత్త కాబట్టి, డైరెక్టర్స్ ఎలా చెప్తే అలాగే నటించాను. నా స్టయల్ అంటూ ప్రెజెంట్ చేయలేదు. ఇపుడు కొంచెం కాన్ఫిడెన్స్, ఎక్స్‌పీరియన్స్ వచ్చాయి కాబట్టి నా తదుపరి సినిమాల్లో రియల్ రష్మికను చూస్తారు.
రూమర్స్ పట్టించుకోను
నా విషయంలో వస్తున్న రూమర్స్‌ని అస్సలు పట్టించుకోను. సోషల్ మీడియాలో.. ఒక సెకన్‌లో వాళ్ళ మైండ్‌లో వచ్చిన ఆలోచనని పోస్ట్ చేసేసి, నెక్స్ట్ మూమెంట్‌లో మర్చిపోతారు. అలాంటివాళ్ళను మనం పట్టించుకుని ఫీలవ్వడం వేస్ట్. నన్ను తెలుగులోకన్నా ముందుగా గుర్తించింది కన్నడ సినిమా. వాళ్లకు నేను లైఫ్‌లాంగ్ రుణపడి ఉంటా. తెలుగు ప్రేక్షకులు నన్నింకా గుర్తించాల్సి ఉంది. అయినా సినిమా విషయంలో స్క్రిప్ట్ నచ్చాలి కానీ ఏ భాషలో అయినా చేసేస్తా.

- శ్రీ