ఆది ‘బుర్రకథ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయితగా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు తొలిసారి దర్శకుడిగా రాబోతున్నారు. శుక్రవారం ప్రారంభం అయిన ఈ సినిమాలో యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్నారు. బుర్రకథ అనేది సినిమా టైటిల్. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమాలోని హీరో ఫస్ట్ సీన్‌కి క్లాప్ అందించగా, లిరిసిస్ట్, రచయిత అయిన శివ శక్తి దత్తా కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ- ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా తోటి రచయితలు, పెద్దలు ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు. ఈ సినిమా ద్వారా స్క్రీన్‌ప్లే రైటర్స్‌ని పరిచయం చేస్తున్నాను. కథ చెప్పిన వెంటనే సినిమాని ఓకె చేసి నాపై నమ్మకం ఉంచిన హీరో ఆదికి కృతజ్ఞతలు అన్నారు. రచయిత శివశక్తి దత్తా మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక పాట రాస్తున్నాను. ఈ సినిమా విజయం సాధించి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు. హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ- ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థాంక్స్. ఈ సంవత్సరంలో ఇది నా మూడో సినిమా. ఈ మూడు సినిమాలు నాకు ఎంతో ఎగ్జయటింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా చేయడం ఎంతో థ్రిల్‌గా ఉంది. రత్నబాబు మంచి ఫ్రెష్ లైన్‌తో వచ్చారు. ఇందులో నా పాత్ర డిఫరెంట్‌గా చాలా బాగుంటుంది అన్నారు. నిర్మాత శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ మా బ్యానర్‌లో ఇది రెండో సినిమా. బుర్రకథ తప్పకుండా ఓ మంచి సినిమా అవుతుంది. మా బ్యానర్‌కి మంచి పేరొస్తుంది. రేపటినుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇంకో వారంలో హీరోయిన్స్, ఇతర నటీనటులు కన్‌ఫర్మ్ అవుతారు అన్నారు. ఆది సాయికుమార్, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమరళి, పృధ్విరాజ్, గాయత్రి గుప్తా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఫైట్స్: వెంకట్, నిర్మాత: హెచ్.కె. శ్రీకాంత్ దీపాల, స్క్రీన్‌ప్లే: ఎస్.కిరణ్, ప్రసాద్ కామినేని, సురేష్, దివ్య భావన బండ్ల మరియు సయిద్ తాజుద్దీన్, కథ, మాటలు, దర్శకత్వం: డైమండ్ రత్నబాబు.