విశ్వదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లెజండరీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ బయోపిక్‌ని ‘విశ్వదర్శనం’ అనే టైటిల్‌తో తెరకెక్కించబోతున్నారు దర్శక రచయిత జనార్థన మహర్షి. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించనున్నారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ బయోపిక్‌ను ఓ డాక్యుమెంటరీగా రూపొందించాలని దర్శక నిర్మాతలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మరి డాక్యుమెంటరీ టైపు చిత్రాలు అంతగా అలవాటు లేని తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. ఇంతకీ ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే విశ్వనాథ్ గారి పాత్రను పోషించే నటుడికోసం చిత్ర బృందం అనే్వషిస్తోంది. ఇద్దరు ముగ్గురి నటుల పేర్లను పరిశీలిస్తున్నప్పటికీ ఇంకా ఎవర్ని ఫైనల్ చేయలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది.