మెర్సల్ దర్శకుడితో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న సర్కార్ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇళయదళతిగా తమిళ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన విజయ్‌కు రజని తరువాత ఆ రేంజ్ క్రేజ్ ఉంది. ఇప్పటికే తన 65వ సినిమాలో నటిస్తున్న విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈసారి ఆయనతో పనిచేసే దర్శకుడు ఎవరో తెలుసా? అట్లీకుమార్. విజయ్‌తో చేరి, మెర్సల్ లాంటి సినిమాలను తెరకెక్కించి మంచి విజయాన్ని అందించిన అట్లీతో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. తాజాగా అట్లీకుమార్ చెప్పిన కథ నచ్చడంతో విజయ్ ఓకె చెప్పేశాడు. అన్నట్టు విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాల లిస్ట్‌లో తేరి, మెర్సల్ చిత్రాలు ముందువరసలో ఉన్నాయి. అందుకే మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం మురుగదాస్ సినిమా పూర్తవ్వగానే.. అట్లీ సినిమా మొదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై కోలీవుడ్ జనాల ఆసక్తి ఎక్కువైంది.