ఊపిరి కోసం చాలా టేకులు తీసుకున్నా .. నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇలాంటి భిన్నమైన పాత్రలు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు చేశారు. ఈమధ్య ఈ తరహా సినిమాలు తగ్గిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు నేను చేస్తున్నందుకు ఆనందంగా వుంది’ అంటున్నాడు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున. నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్యపాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి సినిమా పతాకంపై రూపొందిన ఊపిరి చిత్రం ఈనెల 25న విడుదలవుతున్న సందర్భంగా నాగార్జునతో ఇంటర్వ్యూ..
ఆ ఇద్దరి కథే
నాలుగేళ్లక్రితం ఫ్రెంచ్ సినిమా ఇన్‌టచబుల్స్ చూశాను. బాగా నచ్చింది. అప్పుడే దీన్ని తెలుగులో చేస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. ఆ తరువాత కొన్ని రోజులకు ఇదే కథను తీసుకుని వంశీ నా దగ్గరకు వచ్చాడు. కథ ఎప్పుడైతే ఇన్‌టచబుల్స్ అని తెలిసిందో వెంటనే చేయడానికి ఓకె చెప్పాను. అంతేకాకుండా దాన్ని మన నేటివిటీకి తగ్గట్టుగా వుండాలని చెప్పా. ఇందులో విక్రమాదిత్య అనే పాత్రలో నటించాను. నిజానికి తను ఓ బిలీనియర్. వీల్‌ఛెయిర్‌కు పరిమితమైన విక్రమాదిత్యకు ఓ మంచి స్నేహితుడు కావాలని కోరుకుంటాడు. అనుకోకుండా ఒక బీద యువకుడైన కార్తీక్ తన లైఫ్‌లోకి ఎంటర్ అయిన తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా.
చాలా కష్టం అనిపించింది
ఈ సినిమాలో నా పాత్ర మొత్తం వీల్‌ఛెయిర్‌లోనే కనిపిస్తుంది. ఎలాంటి ఫ్లాష్‌బ్యాక్‌లు కాని, డ్రీమ్‌లోకి వెళ్లడం కానీ ఏదీ ఉండదు. వీల్‌ఛెయిర్‌లో కూర్చుని కాళ్ళూ చేతులు కదలకుండా కేవలం ముఖ కవళికలతోనే సినిమా మొత్తం చేయడం నిజంగా చాలా కష్టమనిపించింది. దీన్ని గమనించడానికి ఓ అసిస్టెంట్‌ను కూడా పెట్టారు. షూటింగ్‌లో చాలా టేక్‌లు తీసుకోవాల్సి వచ్చింది. అయినా సరే వంశీ ఓపిగ్గా తీసుకున్నాడు. ఎన్ని టేక్‌లు తీసుకున్న తరువాత నా మీద నాకే నాకు యాక్టింగ్ రాదా? ఇన్ని టేక్‌లు తీసుకుంటున్నాను అని అనిపించేది.
నాకు లైఫ్ ఛేంజింగ్ ఫిలిం
ఊపిరి సినిమా నా కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది. చాలామంది సోగ్గాడు సినిమాతో అదరగొట్టిన మీరు ఇలా వీల్‌ఛెయిర్‌లో కూర్చుంటే ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారని. మంచి సినిమా వుంటే తప్పకుండా వారు ఎంకరేజ్ చేస్తారు. నేను ఇదివరకు నటించిన శివ, గీతాంజలి, నినే్న పెళ్లాడుతా, అన్నమయ్య సినిమాల తరహాలో నా లైఫ్ ఛేంజింగ్ సినిమా ఇది. ఈ సినిమా తరువాత నాగార్జునతో ఏ పాత్ర అయినా చేయించొచ్చు అనే ఆలోచన రచయితల్లో కలుగుతుంది.
కార్తిని చూసి సిగ్గేసేది
కార్తితో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. తను చాలా మంచి వ్యక్తి. అతనే కాదు, వాళ్ల ఫ్యామిలీ మొత్తం అలాగే వుంటారు. తను నటించేటప్పుడు అతని డెడికేషన్ చూసి ఆశ్చర్యమేసేది. అంతేకాదు, అచ్చమైన తెలుగులో మాట్లాడడం చూసి నాకు సిగ్గేసేది. తెలుగు రాకపోయినా నేర్చుకొని మరీ స్వంతంగా డబ్బింగ్ చెప్పాడు. నేను మాత్రం అంత పర్‌ఫెక్టుగా తమిళంలో డబ్బింగ్ చెప్పలేకపోయా. అలాగే తమన్నా కూడా అద్భుతంగా నటించింది. తెలుగులో స్వంతంగా డబ్బింగ్ కూడా చెప్పింది.
అఖిల్ రెండవ సినిమా
అఖిల్ తదుపరి సినిమా గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఓ హిందీ రీమేక్ సినిమా, రెండు కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఊపిరి దర్శకుడు వంశీ పైడిపల్లితో చర్చలు జరుగుతున్నాయి. వారిద్దరూ మాృట్లాడుకుని ఫిక్స్ అయితే అదేంటన్నది నేను సెట్ చేస్తా. వచ్చే నెలలో అనౌన్స్ చేస్తాను.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా మే నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికైతే ఇదొక్క సినిమానే చేస్తున్నా.

-శ్రీ