అమరావతిలో డిక్టేటర్ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ ప్రధాన తారాగణంగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డిక్టేటర్’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ, బాలకృష్ణ అభిమానులు ప్రేక్షకులు ఈ 99వ చిత్రం కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారని, వారు ఎలా బాలకృష్ణను చూడాలనుకుంటున్నారో, అలా వైవిధ్యమైన కథ, కథనంతో డిఫరెంట్‌గా ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా అన్ని ఎలిమెంట్స్ వున్న ఓ సరికొత్త కథతో ఈ చిత్రం రూపొందిందని, తమన్ మంచి పాటలను అందించారని తెలిపారు. తమన్ బాలకృష్ణతో చేస్తున్న తొలి సినిమా ఇదేనని, బాలకృష్ణ ఫస్ట్‌లుక్‌కు అభిమానులనుండి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ఈనెల 20న అమరావతిలో ఆడియో విడుదల జరపనున్నామని, ఈ కార్యక్రమానికి అశేష అభిమానులు తరలి వస్తున్నారని తెలిపారు. ఢిల్లీ, హర్యానాల్లోని అందమైన ప్రదేశాల్లో బాలకృష్ణ, అంజలి, అక్ష, సుమన్ పాల్గొన్న సన్నివేశాల చిత్రీకరణతో సినిమా పూర్తిచేశామని, అనుకున్న సమయంలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తామని ఆయన వివరించారు. పవిత్రా లోకేష్, నాజర్, వెనె్నల కిశోర్, పృధ్వీ, కాశీవిశ్వనాధ్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, హేమ, కబీర్, విక్రమ్‌జీత్, అజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:గౌతంరాజు, సంగీతం: తమన్.ఎస్.ఎస్., కెమెరా:శ్యామ్ కె నాయుడు, రచన:శ్రీ్ధర్ సీపాన, కథ, స్క్రీన్‌ప్లే:కోన వెంకట్, గోపీమోహన్, దర్శకత్వం:శ్రీవాస్.

చిత్రం.. ‘డిక్టేటర్’లో బాలకృష్ణ, అంజలి