హైదరాబాద్‌లో జనతా గ్యారేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ ముఖ్యపాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబాయిలో జరుపుకుంటోంది. దాదాపు వారంపాటు అక్కడ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈనెల 22తో అక్కడి షెడ్యూల్ పూర్తికానుంది. ఆ తర్వాత 25నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఇప్పటికే సారథి స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ నిర్వహిస్తారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం సృష్టిస్తోందట. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలు తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది.