ప్రత్యేక పాటల్లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజీ హీరోయిన్లు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు ప్రత్యేక పాటల్లో కనిపించి, తమ క్రేజ్‌ని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లు దాదాపుగా ఈ ఐటమ్‌సాంగ్స్ చేసి మంచి క్రేజ్ దక్కించుకున్నవాళ్లే. ఇప్పుడు ఈ పరంపర సౌత్‌కి పాకింది. ఇప్పటికే తమన్నా, అనుష్కలాంటి హీరోయిన్లు ప్రత్యేక పాటల్లో కనిపించి, ఔరా అనిపించారు. ఇప్పుడు వీరి కోవలోకి చేరబోతోంది అందాల భామ కాజల్. ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, టాప్‌హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈ భామ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు తమిళంలో కూడా రెండు సినిమాలు ఉన్నాయి. లేటెస్ట్‌గా ఈమె సన్నబడి స్లిమ్‌గా తయారైంది. దీనికి కారణం ఏంటని ఆలోచిస్తే కాజల్ ప్రత్యేక పాటల్లో నటించేందుకే ఇలా గ్లామర్ డోస్‌ని పెంచిందట. ఇప్పటికే ఈమెకు ఓ క్రేజీ సినిమాలో ప్రత్యేక పాట చేయమని అవకాశం దక్కినట్టు తెలుస్తోంది.