సామి ట్రైలర్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి.ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెనే్సషనల్ స్టార్ విక్రమ్ నటించిన చిత్రం సామి. సింగం, సింగం 2, సింగం 3, పూజా వంటి సూపర్‌హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విక్రమ్, హరి కాంబినేషన్‌లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన సామి చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడదే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో అతి త్వరలో విడుదల కానుంది. ట్రైలర్ విడుదల అనంతరం దర్శకుడు హరి మాట్లాడుతూ నేను చేసిన ప్రతి సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ- తెలుగులో నేను చేస్తున్న కొత్త అటెంప్ట్ ఈ సామి చిత్రం. కమర్షియల్ ఎమోషనల్ సినిమా ఇది. నాకు పెద్ద హిట్స్ ఇచ్చి నన్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టాడు హరి. ఎప్పటినుంచో సామి చిత్రానికి సీక్వెల్ చేయాలని అనుకున్నాము కానీ 15 ఏళ్ళు పట్టింది. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే కనిపించాల్సి వచ్చింది. అందుకు కెమెరామెన్ కష్టపడాల్సి వచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఆమెకు మహానటి ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. సామిలో కామెడీ ట్రాక్‌లో నటించింది. విలన్ రోల్‌లో నటించిన బాబీ నాకు మంచి మిత్రుడు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అసెట్. అందరం కష్టపడి సినిమా చేశాం. తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్‌కోసం ఎదురుచూస్తున్నా. తమిళంలో కూడా అతి త్వరలో విడుదల అవుతుంది అన్నారు. చిత్ర నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ట్రైలర్‌తోనే హరి దుమ్ము దులిపేశారు. విక్రమ్ సినిమాలను మేము వదలలేకపోతున్నాము. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎసెట్. నాలుగు రోజుల్లో ఆడియో విడుదలతో మీ ముందుకు వస్తాము అన్నారు. నిర్మాత శిబు, ఆర్‌ఆర్ మూవీస్ మహేష్, కె.వి.వి సత్యనారాయణ, దుర్గం గిరీష్, శోభారాణి, బాబీ సింహ్ (విలన్), సునీల్ తదితరులు ఈ ట్రైలర్ లాంచ్‌కు విచ్చేసి తమ అభినందనలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:వెంకటేష్ అంగురాజ్, ఎడిటర్:వి.టి.విజయన్, టి.ఎస్.జయ్, కథ, దర్శకత్వం:హరి, నిర్మాతలు:బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్.