చైతు కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ. ఎస్, పి.డి.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ- చైతన్యను ఇప్పుడు అందరూ శైలజారెడ్డి అల్లుడు అని అంటున్నారు. కానీ తను అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున పెద్ద కొడుకు. నాన్నకు ప్రేమకథా చిత్రాలైనా, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలైనా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ఉండడాన్ని ఇష్టపడతారు. ఆయన వారసత్వాన్ని ఇపుడు చైతన్య తీసుకున్నారు. చైతన్య సాఫ్ట్ అనుకుంటారు కానీ తనలో చిలిపితనం కూడా ఉంది. దాన్ని మారుతి చక్కగా వాడుకున్నారు. రమ్యకృష్ణ, నేను కలిసి ఎన్నో సినిమాలు చేశాం. అన్నీ పెద్ద హిట్స్. బాహుబలి తర్వాత రమ్య అంటే ఇపుడు భారతదేశంలో తెలియనివారు లేరు. తను ఏ సీన్ చేసినా చక్కగా పండుతుంది. ఇపుడు శైలజారెడ్డి అల్లుడులో అత్త పాత్రలో చైతుతో నటించింది. గోపీసుందర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కేరళకు సమస్యలు వచ్చినా.. డెడికేషన్‌తో మంచి సాంగ్స్, రీరికార్డింగ్ ఇచ్చారు. అందుకు గోపీసుందర్‌కు థాంక్స్. ఎంతోమందికి అన్నం పెడుతున్న నిర్మాణ సంస్థ చినబాబుకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. మారుతి సినిమాలన్నీ చూస్తుంటాను. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. గత నెల నా మనసుకు దగ్గరైన ఇద్దరు వెళ్లిపోయారు. హరి అన్నయ్య, ఎవరినైనా నేను అన్నా అని పిలుస్తాను అంటే తననే. మా మధ్య బంధం మీకు చెప్పుకోలేను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నిండా నవ్వులే. చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ- ఈ ఫంక్షన్‌కి రావడానికి రెండు కారణాలు.. మారుతి, టీమ్ అందరూ ఒక కారణమైతే.. రెండో కారణం నాగార్జునతో దేవదాస్ షూటింగ్ అయిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే.. చైతన్యను చూస్తే అసూయగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తను ఎంత ఎంజాయ్ చేసుంటాడో నాకు అర్థమవుతుంది. మారుతి ఎంటర్‌టైనింగ్ పర్సన్. అలాంటి వ్యక్తి ఆరు నుండి తొమ్మిది నెలలు ఓ సినిమాపై వర్క్ చేశాడంటే సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా నిర్మాత నాగవంశీ నా క్లాస్‌మేట్. ఇంతకుముందు జనరేషన్‌లో బెస్ట్‌సాంగ్స్ అన్నీ నాగార్జునకి పడితే ఈ జనరేషన్‌లో బెస్ట్ సాంగ్స్ అన్నీ చైతన్యకే పడుతున్నాయి. ఈ సినిమాలో కూడా పాటలు చాలా బాగున్నాయి. టీజర్, ట్రైలర్ బావున్నాయి. గోపీసుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి అన్నారు. అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ- అక్కినేని అభిమానులే మా బలం. వారివల్లేనాకు ఎంకరేజ్‌మెంట్ దొరుకుతుంది. అక్కినేని అభిమానులని గర్వపడేలా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమా అలాంటి సినిమా. మారుతి సూపర్బ్ సినిమా ఇచ్చారు. కొత్త బాడీ లాంగ్వేజ్, ఎనర్జీతో నన్ను ప్రెజెంట్ చేసిన మారుతికి థాంక్స్. నాగవంశీ, ప్రసాద్ రెండేళ్ళ క్రితం నాకు మరచిపోలేని ప్రేమమ్ ఇచ్చారు. రెండేళ్ళ తర్వాత ఇపుడు మారుతితో మంచి కాంబినేషన్ సెట్ చేశారు. రమ్య మేడమ్ నుండి మాకు బిగ్గెస్ట్ సపోర్టు వచ్చింది. రమ్య మేడమ్‌ను దృష్టిలో పెట్టుకునే మారుతి నాకు ఈ కథను చెప్పారు. హీరోయిన్‌గా చేసిన అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాతో ఇంకా హైట్స్‌కి రీచ్ అవుతుంది. గోపీసుందర్ ప్రేమమ్ తర్వాత మరో సూపర్‌హిట్ ఆల్బమ్ ఇచ్చారు. కెమెరామెన్ నిజార్, సీనియర్ నరేష్, పృధ్వీ అందరికీ థాంక్స్. పండగకి పండగలాంటి సినిమా. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది అన్నారు.