ఏప్రిల్ 1న ఎటాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాష్‌రాజ్, సురభి ప్రధాన తారాగణంగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ శుభశే్వత ఫిలింస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘అటాక్’. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వరుణ్, తేజ, శే్వతలాన, సి.వి.రావు సంయుక్తంగా నిర్మించారు. రవిశంకర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరారాబాద్‌లో జరిగింది. ఆడియో సీడిని రామ్‌గోపాల్‌వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ, వర్మ ఎక్కువ సినిమాలు చేయడంవల్ల మధ్యలో కొంత టైమ్ తీసుకుంటూ ఈ సినిమాను పూర్తిచేశామని, ఈ వేసవి కాలంలో విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాక విడుదల చేయడానికి నిర్ణయించామని తెలిపారు. ఏప్రిల్ 1న విడుదల కానున్న ఈ చిత్రం చూశాక వర్మ ఈజ్ బ్యాక్ అని ప్రతి ఒక్కరూ అంటారని, అలాగే సినిమాలో నటించిన ప్రతివారికి ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆయన తెలిపారు. సురభి ఇప్పటివరకు హీరోయిన్‌గా చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో నటించిందని తెలిపారు. నిర్మాత తననుండి డ్రై డ్రామా, యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులు కావాలని అడుగుతున్నారని చెప్పడంతో ఈ సినిమాను మొదలుపెట్టామని, గజల్ శ్రీనివాస్ ఈ సినిమా కోసం ఓ పాట పాడారని, చిరంజీవి నటించిన ‘కొట్టండి తిట్టండి’ పాటను బేస్ చేసుకుని మరో పాటను రాయించామని, ఈ పాట వేరే స్టైల్‌లో వుంటుందని రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. ధూల్‌పేట వంటి ఏరియాలో ఈ సినిమాను చిత్రీకరించామని ఆయన అన్నారు. కార్యక్రమంలో సురభి, పూనమ్ కౌర్, అంజి, రవిశంకర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.