కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతున్న సమంత, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇప్పటికే స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె యూ టర్న్ చిత్రంలో నటిస్తోంది. కన్నడంలో ఘనవిజయం సాధించిన చిత్రానికిది రీమేక్. పవన్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతున్న సందర్భంగా సమంతతో ఇంటర్వ్యూ..

ఈ రీమేక్‌లో నటించడానికి కారణం?
కన్నడ సినిమా లూసియా దర్శకుడు పవన్‌కుమార్ నాకు బాగా తెలుసు. మంచి స్క్రిప్ట్ వుంటే చెప్పు, నేను చేస్తానన్నాను. కానీ తను నన్ను మర్చిపోయి కన్నడంలో యు టర్న్ సినిమా చేశాడు. ఆ తరువాత అడిగాను- యు టర్న్ సినిమా స్క్రిప్ట్ దశనుండి నాకు తెలుసు. అయితే తను అప్పటికే కమిట్ అవ్వడంతో ఆ సినిమా చేశాడు. దాన్ని నేను తెలుగులో చేయాలనుకున్నాను.
చాలా టైమ్ తీసుకున్నారు?
ఈ సినిమా కోసం నాలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉన్నాయి. ముఖ్యంగా హెయిర్ స్టైల్ మార్చాలి. అయితే అంతకుముందు నేను ఒప్పుకున్న సినిమాలు పూర్తి అయితేగానీ నా హెయిర్ స్టైల్ మార్చడం కుదరదు కాబట్టి టైమ్ పట్టింది. మాతృకకు దగ్గరగానే ఉంటుంది. చిన్న చిన్న మార్పులే చేశాం.
ఈ సినిమాకోసం నిర్మాతగా కూడా మారతానన్నారు?
కథ నాకు అంత బాగా నచ్చింది కాబట్టి నేను తీయాలనుకున్నాను. కానీ అప్పటికే మాకు నిర్మాతలు దొరికారు. నేను సినిమాల్లో నటిస్తూ నిర్మాతగా చేయలేను. ఖచ్చితంగా భవిష్యత్తులో నిర్మాతగా మారతాను. మంచి కంటెంట్ వున్న సినిమాల్ని నిర్మిస్తా.
చైతుతో పోటీగా వెళుతున్నారు?
నిజంగా ఇది ఊహించలేదు. చైతు సినిమా శైలజారెడ్డి అల్లుడు ఆగస్టు 31న విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. దాంతో గ్యాప్ తీసుకుని అదే రోజు విడుదల చేస్తున్నారు. మా సినిమాను మాత్రం ముందునుంచే 13న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. అనుకోకుండా పోటీ వచ్చింది. నాకు చైతుకు మధ్య ఎలాంటి పోటీ లేదు. రెండు సినిమాలు ఆడాలని కోరుకుంటాను.
పెళ్లి తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నారు?
మన హీరోయిన్లకు పెళ్లయిందంటే సినిమాలు మానేస్తారు అనేకంటే అవకాశాలు రావు. కానీ నేను మాత్రం పెళ్లయ్యాక కూడా నటించాలనే అనుకున్నాను. నాకు చైతు సపోర్టు చాలా ఉంది. పెళ్లి తర్వాత నటిస్తున్నందుకు అందరూ అభినందిస్తున్నారు. బాలీవుడ్‌లో అయితే చాలామంది హీరోయిన్లు పెళ్లితరువాత సినిమాలు చేస్తున్నారు కదా!
హీరోయిన్‌ల మధ్య పోటీ ఎలా ఉంటుంది?
పరిశ్రమ అంటేనే గ్లామర్ ఫీల్డ్. హీరోయిన్‌ల విషయానికి వస్తే, మా మధ్య పోటీ వుంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఎలాంటి పోటీ వుండదు. ఎవరి అవకాశాలు ఎవరి సినిమాలు వారివే. ఒక హీరోయిన్ స్థాయి పెరుగుతుంటే ఆమె పక్కనున్న హీరోయిన్ స్థాయి కూడా ఆటోమేటిగ్గా పెరుగుతుంది అని నా ఫీలింగ్.
బాలీవుడ్‌లోకి వెళ్తారని వార్తలొస్తున్నాయి?
చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. నేను ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో సంతోషంగా ఉన్నాను. ఏ భాషలోకి వెళ్లే ఆలోచన లేదు. ఇక్కడే చాలా దూరం ప్రయాణం చేయాలి. ఒక విధంగా ప్రయోగాలకిది తగిన సమయం. అందుకనే ఆ దిశగా భిన్నమైన సినిమాలు చేయాలనేది నా కోరిక.
తదుపరి చిత్రాలు?
చైతుతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. దాంతోపాటు మరో సినిమా కూడా ఉంది. త్వరలోనే దాని వివరాలు తెలియజేస్తా.

-శ్రీనివాస్ ఆర్.రావ్