యూట్యూబ్‌లో రాజావారి మిత్రబృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమటలంక నవీన్, ఈశ్వర్‌రెడ్డి, సుహాస్, నిశాంత్ ప్రధాన పాత్రల్లో సినీ అవుట్‌లుక్ క్రియేషన్స్ బ్యానర్‌పై పటమటలంక ప్రవీణ్ దర్శకత్వంలో కళ్యాన్‌కుమార్ నిర్మిస్తోన్న లఘు చిత్రం ‘రాజావారి మిత్రబృందం’. ఈ సినిమాను ఈ నెలలో యూట్యూబ్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పడమట లంక ప్రవీణ్ మాట్లాడుతూ ‘హరిశ్చంద్రుడు లాంటి నీతిమంతుడు నేటి యుగంలో ఉంటే ఎలా వుంటుందనేదే సినిమా కథ. అలాంటి వ్యక్తిత్వం వున్న వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితులను చాలా ఫన్నీగా ప్రెజెంట్ చేశాం. ఘంటశాల విశ్వనాధ్ అందించిన మ్యూజిక్ కథను ఇంకాస్త ఎలివేట్ చేసింది. సినిమాలో ఒక పాట మాత్రమే ఉంటుంది. సుభాష్ మంచి లిరిక్స్ అందించారు. ఈ నెలలో యూట్యూబ్‌లో మా షార్ట్ ఫిలింను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. నిర్మాత కళ్యాన్‌కుమార్ మాట్లాడుతూ, నవీన్ చెప్పిన కథ నచ్చడంతో షార్ట్ ఫిలిం చేయాలని భావించానని, కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో చేసిన సినిమా ఇదని, అవుట్‌పుట్ బాగా వచ్చిందని చెప్పారు. ఈ చిత్రానికి మ్యూజిక్:ఘంటశల విశ్వనాధ్, ఎడిటింగ్:చోటు చెర్రీ, ఫొటోగ్రఫి:దీపురెడ్డి, లిరిక్స్:సుభాష్, డాన్స్:సాయి క్రిష్, నిర్మాత:కళ్యాణ్ కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం:పటమట లంక నవీన్.