పటాస్ దర్శకుడితో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్. ప్రస్తుతం ఫిలిం సిటీలో జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత బాలకృష్ణ మరో రెండు చిత్రాల్లో నటించేందుకు ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో చర్చలు కూడా జరిగాయి. ఈ చిత్రాన్ని సి.కల్యాణ్ నిర్మిస్తాడని తెలిసింది. దాంతోపాటు తాజాగా మరో యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆయనకు బాలకృష్ణ అంగీకారం తెలిపాడట. ఇంతకూ ఆ యువ దర్శకుడు ఎవరో తెలుసా.. పటాస్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అనీల్ రావిపూడి. సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్న అనీల్, ప్రస్తుతం వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో ఎఫ్2 అనే మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన బాలకృష్ణతో సినిమా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. గతంలో అనీల్ బాలయ్యకు ఓ కథ చెప్పాడని, రామారావుగారు పేరుతో ఆ సినిమా ఉంటుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఆయన అదే కథను చెప్పాడా? లేదా కొత్త కథా అనేది తెలియాల్సి వుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడే అవకాశాలున్నాయి.